ఇండియాలో ఇచ్చేవన్నీ నకిలీ అవార్డులే.. ఆస్కార్ ఈజ్ ద బెస్ట్!
on Mar 11, 2024
96వ ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. ‘ఓపెన్ హైమర్’ చిత్రం అస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమనటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్.. ఇలా మొత్తం ఏడు ఆస్కార్‌లను సొంతం చేసుకుంది ‘ఓపెన్ హైమర్’. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ అతనిపై ప్రశంసలు కురిపించింది. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఇండియన్ ఫిలిం అవార్డుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం అందర్నీ షాక్‌కి గురి చేశాయి.
ఇండియాలో ఇచ్చే ఫిలిం అవార్డులు నకిలీవని కామెంట్ చేసింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డుల గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని, వాటిపై తనకు అసలు నమ్మకం లేదని అంటోంది. కానీ, ఈ రోజు ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న సిలియన్ మరీÊఫని చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోంది. అతన్ని ఉద్దేశించి పపంచంలోనే ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే ఉత్తమంగా నిలుస్తుంది’ అని తన ట్విట్టర్ ఖాతాలో రాసింది.
పనిలో పనిగా ఇండియన్ అవార్డులపై మరో రకంగా తన అక్కసును వెళ్ళగక్కింది. 2022లో తనకు ఒక ప్రముఖ అవార్డు రావాల్సింది. కానీ, రాలేదు అంటోంది. ఆస్కార్ అవార్డులను మెచ్చుకుంటూ ఇండియన్ అవార్డు నకిలీవి అని కామెంట్ పెట్టడం వెనుక ఇంత స్టోరీ ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నీకు అవార్డు రాకపోయినంత మాత్రాన ఇండియన్ అవార్డులను చులకన చేసి మాట్లాడతావా? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Also Read